ఏ కొండూరు:
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టణంలో, ఎంపి కేశినేని శివనాథ్ నివాసంలో ఉమ్మడి కృష్ణ జిల్లాల ఎమ్మెల్యేలు,ఎంపిలు సమావేశం
నెలలో ఒకసారి సమావేశం కావాలని నిర్ణయం,
ఏకగ్రీవంగా కొన్ని తీర్మానాలు ఆమోదం.
విజయవాడ : ఉమ్మడి కృష్ణ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, 2 పార్లమెంట్ నియోజకవర్గ ఎంపిలు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ నివాసంలో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వరద సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కష్టానికి, చూపించిన చొరవకి, విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చూపించిన చొరవకు, వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రకటించిన నష్టపరిహారానికి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలిపారు. అలాగే దసరా సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించబోయే నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు గురించి చర్చించుకున్నారు.
ఇక ఉమ్మడి కృష్ణ జిల్లాలోని సమస్యలు చర్చించుకునేందుకు ప్రతి నెల ఒకసారి సమావేశం కావాలని తీర్మానించుకున్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రజా సమస్యలతోపాటు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించుకోవటం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురామ్, కృష్ణ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కొలికపూడి శ్రీనివాసరావు, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కాగిత కృష్ణ ప్రసాద్, వసంత కృష్ణ ప్రసాద్,బోడే ప్రసాద్ , వర్ల కుమార్ రాజా, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.