మచిలీపట్నం:
ప్రభుత్వ సర్వజన వైద్యశాల మచిలీపట్నం నందు కాకినాడ ఫోరెన్సిక్ డాక్టర్ ఉమామహేశ్వరరావు పై జరిగిన దాడికి నిరసనగా ప్రభుత్వ వైద్యుల సంఘం నిరసన చేపట్టినది కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ దారుణమైన రేప్ మరియు మర్డర్ జరిగి నెల కావస్తున్న ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. మచిలీపట్నంలో ప్రభుత్వ వైద్యులు రాత్రిళ్ళు నైట్ డ్యూటీ చేసే సమయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్యాజువాలిటీ డాక్టర్లు ప్రతిరోజు పేషెంట్లు వారి తాలూకు మనుషులతో ఎన్నో చివాట్లు తింటూ ఇబ్బందులు గురవుతున్నారు. కలకత్తా సంఘటన జరిగిన మరుక్షణం హోం మంత్రి తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఇంతవరకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు.
డాక్టర్ల యొక్క రక్షణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు పక్కనే ఉన్న తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే 200 మంది పైగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని డాక్టర్ల రక్షణ కోసం అపాయింట్ చేశారు కానీ ఇంతవరకు జిల్లా స్థాయి అధికారులు ఎవరు ప్రభుత్వ ఆసుపత్రిలా వైపు కన్నీటి చూడలేదు. ఇది ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ డాక్టర్ల పరిస్థితి రక్షణ కరవై మరో కలకత్తా ఉదంతా పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధికారి డాక్టర్ భానుమూర్తి మరియు మచిలీపట్నం యూనిట్ కార్యదర్శి డాక్టర్ భరత్ సింగ్ నాయక్ మరియు డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్ మరియు మహిళా వైద్యులు వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.