వరద బాధితుల సహాయార్ధం రూ.4లక్షల రూపాయల విరాళాన్ని సిఎం చంద్రబాబుకు అందచేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఏలూరుజిల్లా దెందులూరు ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే వారికి అండగా నిలబడటం చింతమనేని నైజం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నిరూపించారు. ఇటీవల జరిగిన వరదల వల్ల ముంపుకు గురైన ప్రజలను ఆదుకునేందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు.
ఏలూరులో వరద పరిస్థితి పై సమీక్షించడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 4 లక్షల రూపాయల చెక్కును చింతమనేని ప్రభాకర్ స్వయంగా అందజేశారు. అదేవిధంగా ఇటీవల దెందులూరు మండలం కవల గ్రామానికి చెందిన గ్రామ మహిళల బృందం రాజధాని అమరావతి నిర్మాణం కోసం గ్రామంలో సేకరించిన సుమారు 5 లక్షల రూపాయల విరాళాల కలిగి ఉన్న డబ్బాను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా అందజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాల సాధన కోసం దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.