బుట్టాయిగూడెం
బుట్టాయిగూడెం,ఏజెన్సీ గ్రామాల్లో విష జ్వరాలు రాకుండా హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించిప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం సిపిఎం మండల కమిటీ సమావేశం కు మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఉడతా వెంకటేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానుద్దేశించి జిల్లా కార్యదర్శి ఎ రవి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏజెన్సీలో విష జ్వరాలు పెరుగుతున్నాయాన్నారు.ఐటీడీఏ పరిధిలో అనేక మారుమూల గ్రామాల్లో నేటికీ సరైన వైద్యం అందక అనేకమంది గిరిజనులు మృత్యువాత పడుతున్నారన్నారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.గిరిజన వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు.ఏజెన్సీలోని అన్ని పీహెచ్సీలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య సేవలు అందించాలన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించడానికి దూర ప్రాంతాలకు వెళ్లే రోగులకు 108తో పాటు ఫీడర్ అంబులెన్సు లను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఎ కు ప్రధాన రహదారి పై ఉన్న కల్వర్టు లను ఎత్తుగా నిర్మించాలని సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు వెళ్లే జాతీయ రహదారి పై కొండవాగులు ఉదృతం గా వరద నీరు వస్తుందని ప్రయాణికులు ఇబ్బంది. పడుతున్నారని అన్నారు. కొండవాగులపై కల్వర్టు తో పాటు పట్టేన్నపాలెంవద్ద ఉన్న జల్లేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. అనేక గ్రామాల ప్రజలు జంగారెడ్డిగూడెం, గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం కు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మొడియం నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు తామ ముత్యాలమ్మ, అందుగుల ఫ్రాన్సిస్, మండల నాయకులు పోలోజు నాగేశ్వరావు, చుండ్రు బుల్లెమ్మ, కారం భాస్కర్, తెల్లం వెంకటలక్ష్మి, వెట్టి వీరయ్య, కొవ్వాసు దుర్గారావు,తదితరులు పాల్గొన్నారు...