ఆనందపురం:-
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల ఆనందపురం పంచాయితీ, దొంతల వారి కళ్ళల్లో బుధవారం శ్రీ వరిసిద్దు వినాయక మహోత్సవ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 1500 మంది భక్తులకు అన్న సామారధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం వినాయకుడి నిమగ్న కార్యక్రమం సందర్భంగా కోలాటం, కాంగో వంటి నృత్య కార్యకలాపాలు భారీ బాణాసంచి మధ్యన వినాయకుడి నిమగ్నం జరిగింది. కార్యక్రమంలో దొంతలా ఆదినారాయణ,దొంతల శ్రీను ( మాస్టర్), బంగారు రాజు,వెంకట్ నారాయణ, దొంతల చిన్న శ్రీను,నాగరాజు,శంకర్,సన్యాసమ్మ,నాగమణి,రమేష్, గ్రామపెద్దలు,మహిళలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
లోడగలవానిపాలెం గ్రామంలోర గిన అన్నదాన కార్యక్రమంలో వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, స్థానిక నాయకులు లోడగల అప్పల నాయుడు, మాజీ ఎంపీటీసీ లోడగల వెంకటరావు, ఎంపీటీసీ రౌతు వెంకటరావు, బమ్మిడి తారక్, జై జవాన్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ముడసల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయంగా పదివేల రూపాయలను కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ విరాళంగా ప్రకటించారు.