ఏలూరుజిల్లా వేలేరుపాడు మండలం లో తాటుకూరుగొమ్ము ను శనివారం జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కె. అద్దయ్య, డ్వామా పిడి ఎ. రాము,తహసీల్దార్ డి వి సత్యనారాయణ పర్యటించారు. గ్రామంలో పారిశుధ్య పరిస్ధితులను పరిశీలించారు. ఈ సందర్బంగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో హ్యాబిటేషన్ అధికారులు హాజరవుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. గోదావరి తగ్గుముఖం పడుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండి,అధికారుల సూచనలు పాటించాలని కోరారు.