Subscribe Us

header ads

కరకుదురు లో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ


కాకినాడ:

కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పందిరి రాటవేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి, హితాకారిణి సమాజం డైరెక్టర్ వుండ్రు సత్యనారాయణ వ మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో ఉన్న దుర్గాదేవి గుడి దగ్గర శరన్న నవరాత్రి మహోత్సవంలో భాగంగా పందిరి రాట ముహూర్తానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఎంతో ప్రణాళిక బద్ధంగా గత 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఈ అమ్మవారు చాలా నిదర్శనం అని, పెదపూడి మండలం లో ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ ఈ అమ్మవారి మహిమ తెలుసని, కరకుదురు గ్రామంలో దుర్గాదేవి వెలసినప్పుడు నుంచి కూడా చాలా సిరి సంపదలతో, ధన ధాన్యాలతో అందరూ కూడా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వ్యవసాయ రీత్యా చాలా అభివృద్ధి చెందారని, దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శేషాచార్యులు ఆధ్వర్యంలో పూజలు చాలా చక్కగా జరుగుతాయని, కాబట్టి ప్రతిరోజు భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నామని, అలాగే విజయదశమి చివర రోజున కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి చీర సారె తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని వారు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తోటకూర శ్రీను, అడబాల బుజ్జి, అడపా శ్రీను, అల్లం గంగాధర్, అల్లం బుజ్జి, అడపా రాము, మద్దూరి ఆదినారాయణ, కర్రీ శ్రీను, అడపా శ్రీనివాస్, బుద్దాల శివకృష్ణ, చోడిశెట్టి దుర్గారావు, గొల్లపల్లి శ్రీనివాస్, పులి కేశవ ప్రసాద్, పెద్దిరెడ్డి సాయిబాబు, కంచి మూర్తి రాంబాబు, సాన వీరబాబు, అల్లం బాబులు, సానా రాజు, కంచి మూర్తి చిన్న రాంబాబు, పేపకాయల గోవిందు, అల్లం కాళీ కృష్ణ, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.