- పోటెత్తిన ప్రైవేట్ టీచర్స్
- సమస్యలపై గళ మెత్తిన టీచర్స్
విజయవాడ :పిటీఎల్పీయు రాష్ట్ర అధ్యక్షులు గా కె వి ఆర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కస్టాల బాబ్జీ(కఫ్ఫీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడ తాటి గడప లోని ఎన్ ఆర్ ఐ జూనియర్ కాలేజీ లో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం వి.నవీన్ చౌదరి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎన్ ఆర్ ఐ ఎగ్జి గ్యుటివ్ డైరెక్టర్ పి.తిలక్ బాబు, ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్, జి వి ఆర్ కోచింగ్ సెంటర్ సి ఇ ఓ టీ.వీరయ్య, ర్యామ్స్ అకాడమి సి ఇ ఓ పులి మధుసూదన్, సైకాలజిస్టు లు ఎ.అనంతకుమార్ , రామారావు లు ప్రసంగించారు. రాష్ట్రంలోని నలు మూలనుండి వందలాదిగా పలు విద్యాసంస్థ ల నుండి టీచర్స్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ , డీన్లు, ఏజిఎం లు, ప్రిన్సిపాల్ లు, అధిక సంఖ్య లో పాల్గొన్నారు. సమస్యలపై పరిష్కార మార్గాలు చే పట్టాలని నినదించారు. అనంతరం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. బాబ్జీ( కఫీ)నీ రాష్ట్ర అద్యక్షులు గా, టి.నరహరి ప్రధాన కార్యదర్శి గా సమావేశం ఏక గ్రీవంగా ఎన్నుకుంది. ఎన్నికైన నూతన రాష్ట్ర కార్యవర్గ కమిటీని సమావేశం అభినందించింది.