Subscribe Us

header ads

శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా నవరాత్రులు ప్రారంభోత్సవం.


 జంగారెడ్డిగూడెం:

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం సోమవారం ఉదయం 10 గంటలకు మన జంగారెడ్డిగూడెం పట్టణ మధ్యస్థంగా వేంచేసి ఉన్న పట్టణ ప్రజల ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్న శుభ సందర్భముగా ఆహ్వాన కరపత్రములు పట్టణ ప్రముఖులు మరియు విలేకరుల సమక్షంలో మన గంగానమ్మ ఆలయం వద్ద ఆవిష్కరించడం జరిగినది ఇందు మన ఆలయ అర్చక స్వాములు పెద్దింటి నరసింహాచార్యులు వాడపల్లి శేషాచార్యులు గారు దసరా నవరాత్రులలో అమ్మవారి ప్రాముఖ్యతను మరియు గంగానమ్మ అమ్మవారి దసరా విశిష్టతను , తదితర అంశాలను వివరిస్తూ ఆహ్వాన కరపత్రములను ఆవిష్కరించి దసరా నవరాత్రులలో జరుగు పూజా కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కాకాని శ్రీహరి రావు, మరియు ఆలయ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు