Subscribe Us

header ads

తెలుగు నేల‌పై చెర‌గ‌ని జ్ఞాప‌కం డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి..

రెడ్డిగూడెం :

వైయ‌స్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వ గ్రామంలో వైస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి .. ఈ సందర్బంగా మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తూ.. రూ.1,100 కోట్ల సేద్యపు విద్యుత్‌ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. 

ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి.. వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు అని తెలిపినారు.. ఈ కార్యక్రమం లో పాలంకి సురేష్ రెడ్డి,మాజీ సర్పంచ్ కోమటి కృష్ణ,మాజీ ఎంపీటీసీ కొలుసు గంగాధర్, పాలంకి రమణారెడ్డి,మండల SC సెల్ అధ్యక్షులు చాట్ల రామారావు,మాజీ ఉప సర్పంచ్ బొమ్మిన సత్యనారాయణ,దాసరి గురవయ్య తదితరులు పాల్గొన్నారు..