విజయవాడ జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో స్వయంగా పర్యటన వరద ముంపు ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు నేరుగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆహార పంపిణీ, బాధితుల తరలింపు చేపట్టి నిరాశ్రయులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి స్ఫూర్తిగా సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు.
విజయవాడలో జక్కంపూడి జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం వరద బాధితులకు, నిరాశ్రయులకు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కెట్లను స్వయంగా అందజేశారు. మూడు పూటలా బాధితులకు ఆహారం అందించే విధంగా చర్యలు చేపట్టారు. చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా లోడర్ లో వెళ్ళి ఆహారాన్ని అందజేశారు. వరద సహాయక చర్యల్లో నేరుగా పాల్గొంటూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు.
APGovtWithFloodVictims
2024APFloodsRelief
NaraChandraBabuNaidu
AndhraPradesh