తిరువూరు
జనసేన, చిరంజీవి యువత, మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం.
ఈ సందర్బంగా తిరువూరు పట్టణం లోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, డిగ్రీ కళాశాల లోని పునరావాస కేంద్రం లో తుఫాన్ భాధితులకు భోజన సౌకర్యం అందచేశారు. అంతకు ముందు మెగా అభిమానులు పట్టణ ప్రధాన వీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు గా ఎన్నో అటు పోట్లను ఎదుర్కుని నేడు ఉప ముఖ్య మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్న మీరు మున్ముందు మరెన్నో జన్మదినోత్సవాలు వేడుకగా జరుపుకోవాలని, ఈ పుట్టినరోజు మీకు నిండు నూరేళ్లు ఆరోగ్యం, సుఖ సంతోషాలతో మీ రాజకీయ జీవితం అభివృద్ధి పధం లో సాగేలా ఆ దేవ దేవుడు నిండు మనస్సుతో ఆశీర్వాదాలు అందచేయాలని ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమములో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. గార్గేయి, జన సైనికులు, చిరంజీవి యువత, మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.