ఖమ్మం
ఖమ్మం కేంద్రంగా జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నా డీమాండ్ ను అసెంబ్లీ లో చర్చించాలని మరియువరద భీభత్సంతో నష్ట పోయిన నయాబజార్ స్కూల్ కాలేజీ మరియు జలగం నగర్ విద్యాసంస్థల లో విద్యార్థుల కు నెలకొన్న సమస్య లు తెలంగాణ ప్రభుత్వం ద్యారా పరిష్కారం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా పిడిఎస్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శలు వెంకటేష్ లు పాల్గోని మాట్లాడుతూ హై స్కూల్ నుండి పదోవ తరగతి మరియు ఇంటర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు,పత్రాలు, విలువైన డాక్యుమెంట్లు, ఇతర సర్టిఫికెట్లు వరద దాటికి కనిపించ కుండా పోవడం దీంతో విద్యార్థులు కన్నీరు మున్నీరు అవుతున్నారని ఇప్పటి కైనా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు జిల్లా మినిస్టర్లు స్పందించి విద్యార్థుల కు ధైర్యం చెప్పి వారి సర్టిఫికెట్స్ వారికి ఇచ్చేలా చెర్యలు చేపట్టాలన్నారు.
భారీ వరదనీరు ప్రభుత్వ జలగం నగర్ స్కూల్ మరియు నయాబజార్ స్కూల్,కాలేజీ లోకి రావడం వలన సుమారు కోటిరూపాయలు పై వరకు నష్టం జరిగిందని కావున ఇట్టి సమస్య లను తెలంగాణ ప్రభుత్వం ద్యారా తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.ఖమ్మం కేంద్రంగా జనరల్ యూనివర్సిటీ డిమాండ్ చాలా కాలంగా ఉన్నదని నాటి నుండి నేటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు హామీ ఇచ్చారని, ఖమ్మం కేంద్రం గా యూనివర్సిటీ నెలకొల్పడం కోసం అన్ని రకాల అవకాశాలు కూడా ఉన్నాయి అని తెలంగాణ ముఖ్యమంత్రి ద్రుష్టి తో పాటు అసెంబ్లీ లో చర్చించి ఖమ్మం జిల్లా లో ఉన్న సమస్య లు పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం లో పిడిఎస్యూ ఖమ్మం నాయకులు యశ్వంత్,ప్రసాద్, నాగుల్ మీరా,కుమార్ శ్రీను,స్టాలిన్, వెంకటేష్, రాకేష్ భరత్,తదితరులు పాల్గొన్నారు