Subscribe Us

header ads

అమిరిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమం

 

మైలవరం,

ఎన్టీఆర్ జిల్లా మైలవరం.అమిరిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమం.అమిరిశెట్టి ఫౌండేషన్ ట్రస్ట్, ఫౌండర్ నాగరాజు లండన్ లో ఉంటూ తమ సొంత నియోజకవర్గానికి తనవంతుగా సహాయం అందించాలని ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.గత నాలుగురోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మైలవరం వరదతో ముంచెత్తింది.అందులో భాగంగానే ఈ రోజు ఈ ట్రస్ట్ నుండి ఒక 500 మందికి ఆహారం అందించడం జరిగింది.ఈ ట్రస్ట్ నుండి మెడికల్ క్యాంప్ లు, చదువుకోవాలి అనుకునే నిరుపేదల విద్యార్థినీ విద్యార్థులకు సహాయం చేసే దిశగా ముందుకు వెళతామని ట్రస్ట్ పౌడర్ అమిరిశెట్టి నాగరాజు తెలిపారు.ఈ కార్యక్రమం లో, అమిరిశెట్టి వెంకటేశ్వరరావు, గుంజి మహేశ్వరరావు, రామ్ నాయక్, కిషోర్, దేవిందర్ తదితరులు పాల్గొన్నారు.