ఆనందపురం
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల బోని గ్రామంలో సోలార్ రూఫ్ టాఫ్ పై అవగాహన సదస్సు పెట్టడం జరిగింది ఈ సదస్సుకు శ్రీ పోలాకి శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరషన్ జోన్ 3 మరియు టీ కిరణ్ కుమార్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఏ.సురేష్ కుమార్ ఆసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు పంచాయతీ ప్రజ ప్రతినిధిలు ప్రజలు హాజరు కావడం జరిగింది ఇందు మూలం గా శ్రీ పోలాకి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాఫ్ పధకం క్రింద 1కిలొ వాట్ కి Rs.30000 2వ కిలో వాట్ కి Rs.30000 3వ కిలో వాట్ కి Rs.18000 మొత్తం 3 కిలో వాట్లు కు గాను Rs.78000 సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం సోలార్ కి అయ్యే ఖర్చులో 10 శాతం అప్లికేంట్ కట్టుకొనగా మిగిలిన 90 శాతం ప్రభుత్వము తక్కువ వడ్డీకి బ్యాంకు లోను కల్పిస్తుంది. 45 దినములలో ప్రభుత్వ సబ్సిడీ బ్యాంకు లోను ఖాతాకు జమ చేయబడును అని తెలిపారు. ఇందుమూలంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు.