Subscribe Us

header ads

తుమ్మగూడెంలో పెద్దచెర్వు వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన తొవ్వా చిలక యువకుడు.



  చాట్రాయి
   ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో రోడ్డు పైనుండి ప్రవహిస్తు న్న పెద్దచెర్వు వాగు వరద నీరును మోటారు సైకిల్ పై దాటుతూ వరద ఉద్రృతికి వాగులో పడి యువకుడు మృతిచెందినట్లు ఏఎస్ఐ గజపతిరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే లింగపాలెం మండలం రాయుడుపాలెం శివారు తువ్వాచిలక గ్రామానికి చెందిన పొదిల సూర్య ప్రకాష్ (35సం:) మరియు మరో ఇద్దరు కలసి తుమ్మ గూడెం గ్రామంలో బందు వుల పెదఖర్మ కార్యక్రమా నికి మోటారు సైకిల్ పై వెళుతూ దళితవాడ ప్రభుత్వ పాఠశాల వెనుక పెదచెర్వు నుండి ఎర్ర చెర్వుకు ప్రవ హిస్తున్న వాగు వరదలో ప్రమాదపు శాతం పడిపోగా ఇద్దర్ని స్తానికులు కాపాడారని, పొదిల సూర్యప్రకాష్ అనే యువకుడు వరద ఉద్రృతికి కొట్టుకు పోయి తూరలమద్యలోఇరుక్కుపోయి మృతి చెందినట్లు స్తానికులు తెలిపారు. మృతునికి భార్యా ఇద్దరు బాబు,పాప ఉన్నారని, మృతుడు ధర్మాజిగూడెం ప్రతిభ కాలేజీలో లెక్సిరర్ గా పనిచేస్తాడనితెలిసింది.

 మృతదేహాన్ని గ్రామ కార్యదర్శి రిపోర్టు మేరకు పంచనామాచేసి పోస్టు మార్టం నిమిత్తం చింతల పూడి ప్రభుత్వ హస్పటల్ కు తరలించి నట్లు ఏఎసై గజపతిరావు తెలిపారు. తుమ్మగూడెం దళితవాడ ను ఆనుకొని పెదచెర్వు అలుగు పడినప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రమాదం జరుగుతునే ఉన్నదని,గతంలో కూడా మనుషులు,పశువులు చనిపోయిన సంఘటలు జరిగాయని, తుపఫాను లు వచ్చిన ప్పుడు ఈ వాగు వరదనీటికి ఇండ్లు సైతం మునిగి పోతాయని స్తానికులు తెలిపారు. పద్దచెర్వు వాగువరద ఇండ్లపై పడకుండా కట్ట నిర్మించాలనీ అలానే రోడ్డుపై వరద ప్రవహించ కుండా కళవర్టు నిర్మించా లని,అడుగుతున్నా ప్రభుత్వ అదికారులు పట్టించుకోవటంలేదని,రోడ్డుకు ఇరువైపుల రక్షణ గోడనిర్మిస్తే ఈరోజు ఈ ప్రమాదం జరిగి మనిషి శనిపోయేవాడు కాదని స్తానికులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగ కుండా చర్యలు చేపట్టాలని స్తానిక ప్రజలు ప్రభుత్వాన్నికోరుతున్నారు.