Subscribe Us

header ads

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మేల్యే కి వినతి. ఎఐటియుసి.


 జంగారెడ్డిగూడెం

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ , ఏఐటీయూసీ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై జిల్లా అధ్యక్షులు కూనపాముల విగ్నేష్ ఆధ్వర్యంలో మంగళవారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షులు కూనపాముల విగ్నేష్ మాట్లాడుతూ తమ సమస్యలను ఎమ్మెల్యేకి వినతిపత్రం ద్వారా తెలియజేశామని , ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు .ముఖ్యంగా జంగారెడ్డిగూడెం గ్రేడ్ 2 మున్సిపాలిటీ అయినందున జనాభాకు తగిన పారిశుద్ధ్య మరియు పంప్ ఆపరేటర్స్ పోస్టులు భర్తీ చేయాలని, రిటైర్డ్ మరియు చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని, మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అప్కాస్ లో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు పిహెచ్ మరియు నాన్ పిహెచ్ కార్మికులు టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన వారిని స్కిల్డ్ వర్కర్స్ గా గుర్తించి వారికి స్కిల్డ్ వర్కర్స్ వేతనాలు చెల్లించాలని, మున్సిపల్ కార్మికులకు ఈపీఎఫ్ సమస్యలు పరిష్కరించాలని నాలుగు అకౌంట్స్ మెర్జ్ చేయాలని చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికులకు ఈపీఎఫ్ క్లియర్ చేయాలని ,పారిశుద్ధ్య కార్మికులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని,రైన్ కోట్స్ మాస్కులు, సబ్బులు ,బూట్లు ఇవ్వాలని ఇంజనీరింగ్ కార్మికులకు గ్లౌజులు టూల్ కిట్స్, వాల్ బిట్స్, టార్చ్ లైట్స్ ,యూనిఫామ్ ,రైన్ కోట్స్ బూట్లు ఇవ్వాలని, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు చెత్త తరలించే వాహనాలకు మరమ్మతులు చేయించాలని, ఆయన డిమాండ్ చేశారు.

 ఇంజనీరింగ్ కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలు అమలు చేయాలని మరియు సెలవులు, జాతీయ పండుగ సెలవులు, వర్తింపు చెయ్యాలని ఇంజనీరింగ్ సెక్షన్ లో పైప్ లైన్ రిపేరింగ్ సిబ్బంది నియమించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు గత ప్రభుత్వం వేతనాలు పెంచలేదని గత 30 సంవత్సరాలు నుండి పనిచేస్తూ ప్రస్తుతం 15000 రూపాయలు మాత్రమే వేతనాలు పొందుతున్నారని కనీస వేతనం 26,000 ఇప్పించవలసిందిగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు కంతేటి వెంకట్రావు, కార్యదర్శి ఎన్ సుబ్బారావు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి బొక్క శ్రీనివాస్ , ఇంగుర్తి నాగరాజు, ఎడ్లపల్లి ప్రసాద్, ఎడ్లపల్లి రాజేంద్ర, కొత్తూరు శ్రీను, దోసూరి చంద్రయ్య, అయినాల ముత్యాలరావు దోసూరి నాగరాజు,వి ప్రసాద్, కొత్తూరి లక్ష్మణ్ రావు, ఎం అప్పలస్వామి, ఎన్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు