ఆనందపురం
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల ఆనందపురం జాతీయ రహదారి రోడ్డు ప్రమాదంతో రక్తసిక్తమైంది.
ఆనందపురం బ్రిడ్జి పై మంగళవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో రెండు లారీలు ఢీ కొనడంతో రెండు లారీల డ్రైవర్ లు అక్కడిక్కడే దుర్మరణం పాలవ్వగా, తీవ్రంగా గాయపడిన క్లీనర్ కెజిహెచ్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.ఈ విషాదకర సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఖమ్మం నుండి భువనేశ్వర్ వెళ్తున్న కంటైనర్ను అటువైపు కాకినాడ నుండి ఒరిసా వెళ్తున్న లారీడ్రైవర్ నిద్ర మత్తులో డివైడరును ఎక్కించి అపోజిట్ లో వస్తున్న కంటైనర్ ను డీకోనటం తో ఇద్దరు డ్రైవర్లు సంఘటన ప్రాంతంలో మృతి చెందారు.
క్లీనర్లకి తీవ్ర గాయాలవ్వడంతో కెజిహెచ్ కి అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గ మధ్యలో ఒకరు మృతి చెందారు.మరో క్లీనర్ ప్రస్తుతం చికిత్స పోందుతున్నారు.మృతి చెందిన వారు అందరు ఒరిసాకు చెందినవారని లారీ డ్రైవర్ల పేర్లు భాస్కర్, శంకర్, క్లీనర్ ప్రదీప్ బెహరా గా పోలీసులు వెల్లడించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.