Subscribe Us

header ads

నేడే చాట్రాయి మండల పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశం.. చాట్రాయి ఎంపీడీవో కే దుర్గాప్రసాద్


 
చాట్రాయి :-

 ఏలూరు జిల్లాలోని చాట్రాయి మండల పరి షత్ అత్యవసర సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల పరిషత్ కార్యాలయం నందు చాట్రాయి ఎంపీపీ లంక నిర్మల అధ్యక్షతన జరుగుతుందని చాట్రాయి ఎంపీడీవో కే దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 23వ తేదీన జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా 18 గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానించిన పనులను మండల పరిషత్ ఆమోదించుట కొరకు ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీ వో కే దుర్గాప్రసాద్ తెలి పారు.మండలంలోని ఎంపీ టీసీలు,సర్పంచులు, అన్ని శాఖల అధికారులు మీడియా మిత్రులు పాల్గొనాలని ఎంపీడీవో కే దుర్గాప్రసాద్ కోరారు.