చాట్రాయి:-
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చనుబండ, జనార్ధనవరం,చాట్రాయి గ్రామాల్లో సీజనల్ వ్యాదులు వ్యాపించ కుండా వీది వీదుల్లో బ్లీచింగ్ చల్లించి,సానిటేషన్ చేయించి డ్రైనేజీల్లో పూడిక తీయించారు. నాల్గురోజులుగా ఎడతెరిపి లేకుండా కురిచిన వానలకు నీరు ప్రవహించి డ్రైనేజీల్లో చత్త పూడిక పేరుకు పోవటంతో డయేరియా,మలేరియా,సీజనల్ జ్వరాలు రాకుండా ముందస్తు చర్యల్లో బాగంగా పారిశుధ్య పనులు చేయిస్తున్నట్లు, వాటర్ ట్యాంకులు ఎప్పటి కప్పుడు కడిగిస్తున్నామని ఈఓపిఆర్డి మట్టా శివ నాగరాజు తెలిపారు. గ్రామంలోని జన నీవాసల మధ్య రోడ్లకు ఇరుపక్కల పూడిపోయిన డ్రైనేజీ పూడిక తీయిస్తూ నీరు నిలవకుండా చేస్తున్నా మని శివనాగరాజు తెలిపారు.గ్రమంలో అలానే మండలంలోని అన్ని గ్రామాల్లో విష జ్వారాలు విజ్రృంబించ కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటు న్నట్లు పంచాయితీ కార్యదర్శులకు ప్రసిడెంట్ల తో మాట్లాడి పారిశుద్యం పనులు వేగవంతం చేయిస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల్లోవిషజ్వరాలు,డెంగ్యూ, మలేరియా, చికిన్ గున్యా వ్యాపించకుండా బ్లీచింగ్ చల్లించడం మరి యు ఏ బైట్ స్ప్రే చేయించ డం జరిగిందని గ్రామంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నట్లు ఈఓపిఆర్డి శివనాగరాజు తెలిపారు. గ్రామంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి బజారు లోనూ క్యాంపులు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఇంటి ఆవరణలో మురికి నీరు నిల్వ ఉండ కుండా చూడా లని పరిశుభ్రత పాటిం చాలని, కాచి వడపోసిన నీళ్లను మాత్రమే తాగాలని గ్రామ ప్రజలను నాగరాజు కోరారు.చనుబండలో గ్రామ సర్పచ్ విస్సంపల్లి జ్వోతి,రామకృష్ణ,చాట్రాయిలో దామెర ఉషా, ప్రసాద్ బాబు, జనార్ధన వరంలో గ్రామ సర్పంచ్ పామర్తి జఝాన్సీరాణి, నాగేశ్వరావు,పంచాయితీ కార్యదర్శిహనుమంతరావు ఆద్వర్యంలో పారిశుధ్య పనులు నిర్వహించినట్లు ఈఓపిఆర్డీ నాగరాజు తెలిపారు.