తిరువూరు:-
తిరువూరు పట్టణంలో గవర్నమెంట్ హైస్కూల్ లో సోషల్ స్టడీస్ ఉపాద్యాయులు గ ఉద్యోగ భాద్యత లు నిర్వహిస్తూ ఇటీవల కాలంలో ఉద్యోగ విరమణ చేసిన ఎ వి వి వెంకటరావు మాష్టారు వీడ్కోలు సభ ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమానికి ఇన్చార్జ్ ప్రధానోపాద్యాయు లు శంకరరావు మాష్టారు అద్యక్షతన జరిగింది.ఈ సభ నుద్దేశించి ఎం ఈ ఓ శ్యామ్ సుందరరావు మాట్లాడుతూ...సమాజంలో గురువుకు మించిన దైవం లేదని తల్లిదండ్రుల తరువాత గురువులే ప్రధానమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి చైర్మన్ వెంపాటి అబ్రాహామ్, మణిరత్నం వైస్ చైపర్సన్ శ్రీమతి పసుపులేటి సీత,భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి నల్లగట్ల రాంబాబు , ఉపద్యాయులు శ్రీనివాసరావు. ఉపద్యాయినీ, ఉపద్యాయులు తదితరులు పాల్గొన్నారు.