Subscribe Us

header ads

పర్యావరణఅనుకూల వినాయకచవితిపై స్పార్క్ సంస్థ నిర్వహణలో ప్రతిభ స్కూల్ లో అవగాహన సదస్సు.


జంగారెడ్డిగూడెం:

 ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోని సమావేశ మందిరంలో స్పార్క్ స్వచ్చంద సేవా సంస్థ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి సౌజన్యంతో పర్యావరణ అనుకూల వినాయకచవితిపై గురువారం ఉదయం అవగాహన సదస్సు మరియు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది స్పార్క్ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి 

సింహాద్రి త్రినాధ్ సమావేశం ప్రారంభిస్తూ పర్యావరణ సంరక్షణ భావితరాలకు ఆరోగ్య భద్రతను అందిస్తుందని సంస్కృతి,సంప్రదాయం కాపాడుకుంటూ వినాయక చవితి జరుపుకోవడంపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి సౌజన్యంతో ప్రతిభ యాజమాన్యం సహకారంతో స్పార్క్ ఈ కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. సభాధ్యక్షత వహించిన ప్రతిభ ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి పర్యావరణ పరిరక్షణ చిన్నారులకు భోదపడితే భవితకు భరోసా దొరుకుతుందని,సామాజిక అంశానికి వేదికగా ప్రతిభ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.

 ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాలుష్య నియంత్రణా మండలి జిల్లా పర్యావరణ ఇంజనీర్ కే.వీ.రావు మాట్లాడుతూ కాలుష్యం కోరల్లో చిక్కి ప్రకృతి సమతౌల్యత కోల్పోయిందని ఇది గుర్తెరిగి ఉమ్మడి రాష్ట్రం లొనే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కృషి సల్పుతోందని ఈ క్రమంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో స్వచ్చంద సంస్థలతో కలిసి అడుగులు వేస్తూ స్పార్క్ ద్వారా ఈ అంశాన్ని జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ముందుకు తీసుకువెళుతున్నామని తెలిపారు. 

సమావేశానికి వ్యాఖ్యాతగా సామాజికవేత్త కే. ఎల్.ఎన్. ధనకుమార్ వ్యవహరించగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ చెడు చేసే వ్యవస్థను నియంత్రిస్తేనే సమాజానికి మంచి అందుతుందని ఆ దిశగా చైతన్యం అవసరమని స్పార్క్ కృషిని అభినందించారు.  మరో గౌరవ అతిధి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతూ ఆదర్శాన్ని చూపుతోందని ఈ క్రమంలో స్ఫూర్తిని నిలిపే బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని అన్నారు.

  జంగారెడ్డిగూడెంకు చెందిన ఇనుముల వెంకట పాపారావు మట్టి గణపతి విగ్రహాల తయారీ ఈ ఏడాది చేపట్టి,దశాబ్దాలుగా తాను నిర్వహిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల అమ్మకాలను స్వచ్చందంగా వదిలిపెట్టడంపై సమావేశం అభినందించింది. ప్రతిభ ఏకడమిక్ డైరెక్టర్ సింధుషా రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తూ స్పార్క్ సంస్థ నుండి మట్టి గణపతి ప్రతిమలు విద్యార్థినీ,విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు,అతిథులకు బహుకరించారు.