Subscribe Us

header ads

సీఎం సహాయ నిధికి రెండు లక్షలు విరాళం


 విజయవాడ:

విజయవాడ భారీ వర్షాల కారణంగా కృష్ణానది చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలువల్లవిజయవాడలో పలు ప్రాంతాలు నీట మునిగినిరాశ్రయులైన వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఉపాధి శిక్షణాధికారుల సంఘంప్రెసిడెంట్ డాక్టర్ బి.వీరభద్రా రెడ్డి సెక్రటరి డాక్టర్ ఎన్.వి. సురేంద్ర బాబు చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఎడ్యుకేషన్ మరియు ఐ.టి. శాఖా మంత్రి నారా లోకేష్ కి రెండు లక్షల చెక్కును అందజేశారు.డాక్టర్ పి. వెంకట్రావు మరియు శ్రీ వి. విజయమారుతీ బాబు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల సహాయార్ధం ఈ సహాయం అందజేసినట్లు అసోసియేషన్ కోర్కమిటీ మెంబర్స్ ముఖ్య సలహాదారులు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మెంబర్స్ అయినటువంటి శ్రీమతి శిరీష,జి.రమేష్ బాబు,డాక్టర్ కె.మాధవరావు,శ్రీమతి హిమబిందు,పి.ప్రకాష్ బాబు,కావూరి శ్రీధర్,
పాల్గొన్నారు.