జంగారెడ్డిగూడెం:
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోజు రోజుకి పెరుగుతున్న వీధి కుక్కలను పట్టించుకునే నాధుడే లేడు స్కూల్ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు కూడా ప్రతి సందుల్లో గొందుల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా ఉండే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి 27వ వార్డు సాయి రామ్ నగర్ కలగొట్లవారి వీధిలో స్కూల్ కి వెళ్లే పిల్లల్ని మోటార్ సైకిల్ మీద వెళ్లే వారి మీదకి వెళ్లి భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి ఈ విషయమై మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు ఎక్కువగా ఈ వీధి కుక్కలు 27వ వార్డులో పేరంపేట రోడ్డులో బాలాజీ టౌన్షిప్ దగ్గర బుట్టాయిగూడెం రోడ్లో కూడా గుంపులు గుంపులుగా ఉన్నాయి తక్షణమే అధికారులు స్పందించి ఈ కుక్కల బెడదను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.