Subscribe Us

header ads

రాజవరంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి ఘన స్వాగతం.


 కొయ్యలగూడెం:

ఏలూరుజిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం నాలుగవ రోజు గ్రామ సభ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండలం రాజవరంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామసభకు పోలవరం శాసన సభ్యులు శ్రీ చిర్రి బాలరాజు కి ఘనస్వాగతం పలుకుతూ ఆహ్వానించిన రాజవరం గ్రామస్థులు.
గ్రామ సభను మొదటిగా వందేమాతరం గీతం తో ప్రారంభించారు.గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజవరం ప్రాధమిక పాఠశాల హెడమాస్టర్ గారు విద్యార్థులు మరియు తోటి ఉపాధ్యాయుల సహకారంతో 25000 వేల రూపాయలు చెక్కును వరద బాధితులు కోసం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కి అందించారు...
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజులలో సాధించిన విజయాలను ప్రజలతో పంచుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పలు హామీలని నెరవేర్చామన్నారు. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు , ఉద్యోగులకి 1వ తేదీన జీతాలు , పెంచిన ఫించన్ పంపిణీ , అన్నా క్యాంటీన్ లు ప్రారంభం ఇలా అనేక కార్యక్రమాలు చేశామన్నారు. విజయవాడలో ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన ప్రజలని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు తో సహా అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేసింది అన్నారు.

వరదల అనంతరం ప్రభుత్వం నష్టపోయిన ప్రజలని ఆదుకునేందుకు వారికి నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిందన్నారు.ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం అని ప్రజలకు తెలిజేశారు .ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి,జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ బోరగం శ్రీనివాస్, మండల అధ్యక్షులు తోట రవి, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.