Subscribe Us

header ads

కాకినాడ ప్రొఫెసర్ పై దాడికి ప్రయత్నించిన శాసనసభ్యుడిని భర్త రఫ్ చేయాలి


 ఆగిరిపల్లి:

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ కాలేజీ దళిత స్పోర్ట్స్‌ వైస్‌ ఛైర్మన్‌పై జనసేన పార్టీ శాసనసభ్యుడు పంతం నానాజీ దాడి చేయడంపై ఆగిరిపల్లి మండల మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు బొబ్బర్ల సురేష్ తీవ్రంగా ఖండించారు.బొబ్బర్ల సురేష్ మాట్లాడుతూ కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావు పైబూతులు తిడుతూ దాడి చేశారన్నారు.ఒక దళిత అధికారిపై కావాలనే దాడి చేశారని ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోయినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.కాలేజీలోకి వచ్చి మరీ అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు.ఇది దళితుల మీద జరిగిన దాడిఅనిమండిపడ్డారు.డిప్యూటీ సీఎం కొనదల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శాసనసభ్యుడుగా బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.