రెడ్డిగూడెం:-
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో 10098 మీటర్లు పొడవునా రహదారుల నిర్మాణ అభివృద్ధి పనులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి (ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) రూ.5కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు తెలిపారు.
ఆయన సోమవారం రెడ్డిగూడెం మండలంలోని రుద్రవరం గ్రామంలో పల్లెపండుగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రవరం గ్రామంలో 644 మీటర్ల పొడవునా నిర్మించనున్న 5 రహదారులకు రూ.33.60 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ అన్నేరావుపేటలో 604 మీటర్ల పొడవునా నిర్మించనున్న 4 రహదారులకు రూ.29.20 లక్షలు, కూనపరాజుపర్వలో 1160 మీటర్ల పొడవునా నిర్మించనున్న 5 రహదారులకు రూ.57.00 లక్షలు, మద్దులపర్వలో 952 మీటర్ల పొడవునా నిర్మించనున్న 4 రహదారులకు రూ.45.90 లక్షలు, ముచ్చినపల్లిలో 600 మీటర్ల పొడవునా నిర్మించనున్న 2 రహదారులకు రూ.30.00 లక్షలు, నాగులూరులో 1105 మీటర్ల పొడవునా నిర్మించనున్న 4 రహదారులకు రూ.48.00 లక్షలు, నరుకుళ్లపాడు 512 మీటర్ల పొడవునా నిర్మించనున్న 3 రహదారులకు రూ.23.00 లక్షలు,పాత నాగులూరులో 280 మీటర్ల పొడవునా నిర్మించనున్న 1 రహదారికి రూ.13.00 లక్షలు, రంగాపురంలో 1430 మీటర్ల పొడవునా నిర్మించనున్న 5 రహదారులకు రూ.75.30 లక్షలు, రెడ్డిగూడెంలో 2371 మీటర్ల పొడవునా నిర్మించనున్న 11 రహదారులకు రూ.122.55 లక్షలు, రుద్రవరంలో 644 మీటర్ల పొడవునా నిర్మించనున్న 5 రహదారులకు రూ.33.
60 లక్షలు, శ్రీరాంపురంలో 440 మీటర్ల పొడవునా నిర్మించనున్న రహదారులకు రూ.22.45 లక్షలు మంజూరు చేశామని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు వెల్లడించారు. ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. మహాకూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమం లో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె విజయబాబు, టీడీపీ మండల పార్టీ ముప్పుడి నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.