విస్సన్నపేట:-
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేస్తున్నామని తిరువూరు శాసనసభ్యులు కోలికపూడి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు తిరువూరు.ఏ కొండూరు.గంపలగూడెం.విస్సన్నపేట. మండలాల అభివృద్ధి పనులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందున నాలుగు మండలాల్లో సిసి రోడ్లు నిర్మించేందుకు ఒక్కొక్క మండలానికి ఐదు కోట్ల రూపాయలను నిధులు కేటాయించి అభివృద్ధి చేసేందుకు పల్లె పండగ అనే కార్యక్రమం ద్వారా సిమెంట్ రోడ్లు నిర్మాణం కొరకు శంకుస్థాపనలు చేసే కార్యక్రమంలో భాగంగా నరసాపురం.కొండ పర్వ.విస్సన్నపేట.తాతకుంట్ల.మారేమండ.కలకర.
తెల్లదేవరపల్లి.పుట్రెల.చుండ్రుపట్ల.వేమిరెడ్డిపల్లి.కొర్లమండ.చుండ్రుపట్ల పెద్ద తండా .గ్రామపంచాయతీ దళిత వాడన బిసి ఏరియా నందు గోడేటి సుబ్రహ్మణ్యం. గ్రామ ప్రథమ పౌరురాలు మారపోగు నాగమణి మరియు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు సహకారంతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు శాసనసభ్యులు కోలిక పూడి శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసరావు ఎన్ టి వి శ్రీనివాస్ ప్రసాదరావు రాయల సుబ్బారావు మురుగుల ప్రసాదు మొత్తం శెట్టి వంశీ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.