Subscribe Us

header ads

6 కోట్ల రూపాలతో సి సి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.


 కొయ్యలగూడెం:-

ఏలూరుజిల్లా కొయ్యలగూడెం మండలం ఇదో చారిత్రక ఘట్టం- పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు - కొయ్యలగూడెం మండలంలో 6 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ.- రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ పేరుతో ఒకేసారి రికార్డు స్థాయిలో సిమెంట్ రహదారుల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవడం ఓ చారిత్రక ఘట్టమని పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పేర్కొన్నారు.- రహదారుల అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు సోమవారం భూమి పూజ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వీటిని నిర్మించనున్నారు.

- ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఈ పల్లెపండుగలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్లతో 30,000 పనులను చేపట్టనుందన్నారు. రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఒకేసారి నిర్వహించనున్నారు, ఇది గ్రామీణ అభివృద్ధికి పెద్ద దోహదం చేసే అవకాశం ఉందన్నారు. - ఈకార్యక్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ శ్రీ బోరగం శ్రీనివాస్,జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.