Subscribe Us

header ads

దళిత కుటుంబానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం.... దీక్ష చేపట్టిన వరసాల


 గోకవరం :-

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో దళితులు నిరసన దీక్ష చేపట్టారు తంటికొండ ఆర్చ్ సమీపంలో మైనింగ్ చెక్పోస్ట్ వద్ద లూధరన్ చర్చ్ ఆవరణలో దళిత నేత వరసాల ప్రసాద్ దీక్ష చేపట్టారు బాధితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు గత మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏం ఆర్ మైనింగ్ సీనరీస్ కాంట్రాక్ట్ సంస్థలో పనిచేసిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కార్తికేయ మే నెలలో విధులు నిర్వహిస్తూ వస్తుండగా ఉదయం బూరుగుపూడి సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదంలో కార్తికేయకు తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు అప్పటినుండి ఇప్పటివరకు 

ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి సంస్థలో నిర్వహకులు ఎవరు కూడా వారిని పట్టించుకోలేదని ఆరోపించారు దళిత బిడ్డ కార్తికేయకు న్యాయం జరగాలని అన్నారు దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు నిరసన దీక్షలో కూర్చున్న వరసాల ప్రసాద్ కు పలు దళిత సంఘాలు మద్దతు తెలిపాయి ఈ నేపథ్యంలో విశ్వహిందూ ధర్మ రామసేన వ్యవస్థాపకులు కంబాల శ్రీనివాసు మద్దతు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆదుకుంటామని ప్రకటించడం జరిగిందని చెప్పారు 

 ఆ డిపార్ట్మెంట్ సంస్థలు పనిచేసిన ప్రతి ఉద్యోగ బాధ్యత ఆయా సంస్థల మీద ఉందని పేర్కొన్నారు దళిత బిడ్డ కార్తికేయకు న్యాయం చేయకపోతే రాష్ట్రస్థాయిలో దళితులందరూ ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆ యొక్క డిపార్ట్మెంట్ సంస్థలో కార్తికేయకు ఉద్యోగ కల్పించిఆదుకోవాలని,కోరారు ..ఈకార్యక్రమంలో గోకవరం మండలం లో ఉన్న దళితులు నియోజకవర్గంలో ఉన్న దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు..