గోకవరం:-
పల్లె పండగ కార్యక్రమం కామరాజుపేట గ్రామ సర్పంచ్ ఆడపా వెంకట్రావు, రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జ్ అడపా భరత్ కుమార్, ఆధ్వర్యంలో ఆరు సిసి రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు.తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో 70 లక్షల రూపాయలతో ఆరు సీసీ రోడ్లును,కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్,చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
అనంతరం కామరాజుపేట గ్రామ జనసేన పార్టీ నాయకులు గుల్లంపూడి ఆనంద్,వరద బాధితులకు సహాయర్థంగా గ్రామ ప్రజలు అందించిన 48 వేల రూపాయలు డిడి ను, గ్రామ సర్పంచ్ అడపా వెంకట్రావు,గ్రామ నాయకులు అడపా భరత్ కుమార్, ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంట్ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ కు,48 వేల రూపాయల చెక్కును, అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, జడ్పిటిసి దాసరి శ్రీరంగ రమేష్, ఎంపీటీసీ అడపా సుహాసిని, మండల అధికారులు, పంచాయతీ అధికారులు,కూటమి నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు భారీగా పాల్గొన్నారు.