Subscribe Us

header ads

చెకుముకి పోటీల్లో మండల విద్యార్థుల ప్రతిభ

 ఆగిరిపల్లి:-

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం జిల్లా స్థాయి చిక్కుముక్కు పోటీలకు మండల స్థాయి లో జరిగిన పోటీల్లో ప్రభుత్వ పాఠశాల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈదర విద్యార్థుల టీం ప్రథమ స్థానాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎం.సురవరం విద్యార్థుల టీం ద్వితీయ స్థానాన్ని సాధించారు.ప్రైవేటు పాఠశాల విభాగంలో హీల్ పేరడైజ్ పాఠశాల ప్రథమ స్థానాన్ని ఎస్ వి పబ్లిక్ స్కూల్ పాఠశాల ద్వితీయ స్థానాన్ని సాధించినట్టు ఆగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి పుష్పలత తెలియజేశారు. విజయం సాధించిన జట్లు జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పాల్గొనున్నట్టు తెలియజేశారు.విజయం సాధించిన విద్యార్థులకు శ్రీ వెంకటేశ్వర పాఠశాల ప్రిన్సిపాల్ గారైన రెడ్డి విద్యార్థులను అభినందించి బహుమతులను అందించారు.