Subscribe Us

header ads

డి పి ఆర్టి యు మండల శాఖ అధ్యక్షునిగా ఎన్నికైన ఏసుబాబు.

 చాట్రాయి:-

చాట్రాయి మండలంలోని ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శుక్రవారం డిపిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీను హాజరయి నూతన కమిటీని ప్రకటించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం చాట్రాయి మండల శాఖ అధ్యక్షునిగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తుమ్మ గూడెం లో పనిచేస్తున్న యేసు బాబునుచాట్రాయిమండల శాఖ అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల C.గుడిపాడు నందు పనిచేస్తున్న తేరా రామారావుని ప్రధాన కార్యదర్శిగా సభ్యులంతా ఏకగ్రీవంగాఆమోదించినట్లుD.శ్రీనుప్రకటించారు. 

సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్య వ్యవస్థను కాపాడ టంతో పాటుగా ఉపాధ్యా యుల సంక్షేమమే ధ్యే యంగా డీపీఆర్టియు పనిచేస్తుందని, 1 1 7 జీవో రద్దుకు కృషి చేస్తామని తెలియజేశారు. ఉపాధ్యాయుల్ని పని ఒత్తిడికి గురి చేయ కూడదని దానివల్ల విద్యార్దులకు తీరని నష్టం వాటిల్లుతుందని, ఇక నుంచి అయినా యాప్ ల భారం తగ్గించి విద్యా బోధనకు ఉపాధ్యాయుల సమయాన్ని కేటాయిం చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు లు శ్రీ ఆర్ వి ఎస్ శోభన్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ పి తిరుపతయ్య ,రాఘవరావు మండల శాఖ కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.