నూజివీడు :-
ఏలూరు జిల్లా,నూజివీడు నియోజకవర్గం అక్టోబరు 11, మంజీర గళం దినపత్రిక,చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే విజయదశమి వేడుకలను ఆనందోత్సాహాలతో ప్రజలంతా జరుపుకోవాలని జనసేన పార్టీ మరీదు శివరామకృష్ణ ఆకాంక్షించారు .. దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు జనసేన పార్టీ మరీదు శివరామకృష్ణ పేర్కొన్నారు..
గత వైకాపా ప్రభుత్వ పాలకుల వైఫల్యాలు, అరాచకాలతో అవస్థలు పడిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారధ్యంలో సాంత్వన చేకూరిందని జనసేన పార్టీ మరీదు శివరామకృష్ణ స్పష్టం చేశారు.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా అడుగులు వేస్తుందని జనసేన పార్టీ మరీదు శివరామకృష్ణ
భరోసా కల్పించారు.