తిరువూరు:-
తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో గల శాంతినగర్ కు చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి తేళ్ల దేవదాస్ గత రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమమించటంతో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య కుమారుడు,కుమార్తె ఉన్నారు. మృతుడు దేవదాస్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవదాస్ మరణం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు, వివిధ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.