Subscribe Us

header ads

మహిషాసురమర్ధినిగా శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి మహర్నవమి దర్శనం.

 జంగారెడ్డిగూడెం:-

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మానవులలో అసురీశక్తులను నశింపచేసి,క్షేమంకరమైన సాత్విక శక్తులను పరిరక్షించి శాంతిని ప్రసాదించే జగదంబను శ్రీ మహిషాసుర మర్ధినిగా శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారిలో మహర్నవమి సందర్భంగా భక్తులు శుక్రవారం దర్శించారని ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన అన్నారు. ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాల

తొమ్మిదవ రోజైన శుక్రవారం మహర్నవమి సందర్భంగా శ్రీ మహిషాసురుమర్ధినిగా నూకాలమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయకమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు),రామలక్ష్మి దంపతుల సారధ్యంలో ఆలయకమిటీ సభ్యులు,శ్రీనూకాంబికా సేవాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఆలయ కళ్యాణ కళావేదికపై ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం,మూలవిరాట్ కు ఏకాదశ మంగళహారతి పూజ అర్చక స్వాములు వేదోక్తంగా నిర్వహించారు.

 తొమ్మిది గంటల నుండి వీరంపాలెం శ్రీబాలా త్రిపురసుందరీ పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఈమని శశి కుమార్ నూకాంబికా వైభవం అనే అంశంపై ప్రవచనం అందించారు. అమ్మవారికి చీకటి దివ్యతేజ, దుర్గాశారద(హైద్రాబాద్), తిరుపతి త్రిపుర రమేష్ దంపతులు,కుసుమ హరనాథ్ వస్త్రాలయం, కపిల హారనాథ్ బాబు కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలను సమర్పించి, పుష్పాలంకరణ, ప్రసాద వితరణకు సహకరించి, ప్రత్యేక ప్రాతః కాల పూజలలో పాల్గొన్నారు. సాయంత్రం శ్రీ కృష్ణ పురందరదాస భజన మండలి జంగారెడ్డిగూడెం వారిచే లలితా సహస్రనామ పారాయణ మరియు భజన జరిగింది 

డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు)మాట్లాడుతూ, స్థానిక సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, నర్మద దంపతులు అమ్మ వారి వెండి చీర తయారీకి 30తులాల వెండిని సమర్పించారుఅని అన్నారు.,శనివారం విజయదశమి రోజు నూకాలమ్మ అమ్మవారు శ్రీరాజ రాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారని, సాయంత్రం శమీపూజ మరియు ఊంజల్ సేవ ఉంటాయని తెలుపుతూ భక్తులకు ఆహ్వానం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు.