Subscribe Us

header ads

మహిషాసుర మర్ధిని దేవిగా శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారు.

 జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా వేంచేసి ఉన్న మన పట్టణ ప్రజల ఇలవేల్పు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో నేడు 9వ రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనం భాగ్యం కలగజేసినారు ఈరోజు అమ్మవారి అలంకారం కు చీరను ఉదయం ప్రసాదమును పట్టణ ప్రముఖులు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కాకాని శ్రీహరి రావు శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు అందజేసినారు.
సాయంత్రం ప్రసాదం శెట్టి జ్యువెలర్స్ యర్రంశెట్టి మల్లేశ్వరరావు శ్రీమతి సాయి ప్రసన్న దంపతులు అందజేశారు ఈరోజు అమ్మవారిని చింతలపూడి గౌరవ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్,, పట్టణ టిడిపి నాయకులు మండల లక్ష్మణరావు, రావూరి కృష్ణ, పరిమి సత్యనారాయణ (సత్తిపండు), కొండ్రెడ్డి కిషోర్, తూటికుంట రాము, 

అడ్డరోడ్ సర్పంచి శ్రీనివాసరావు, ముళ్ళపూడి శ్రీనివాసరావు, దర్శించుకున్నారు వీరికి ఆలయ అర్చకులు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, సెక్రెటరీ కందులపాటి శ్రీనివాసరావు, ట్రెజరర్ చింత నాగరాజు, చోడే ఫణి చంద్రశేఖర్, బుల్లి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సత్కరించారు... పుర ప్రముఖులు మరియు భక్త జనులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అయ్యారు ఈరోజు ఉదయం ప్రభాత సమయాన జరిగిన పూజల్లో సత్యవరపు వెంకటేశ్వరరావు (బుల్లయ్య) దంపతులు, సకినాల కిషోర్ బాబు దంపతులు పసుమర్తి బాలకోటేశ్వరావు గారి దంపతులు దివాకర్ దంపతులు పాల్గొన్నారు ఈరోజు సాయంత్రం శ్రీ మహాకాళి దేవి అలంకారం కు చీరను దామోదర క్లాత్ షోరూం చిట్లూరి లక్ష్మీ సుబ్బారావు అందజేశారు