Subscribe Us

header ads

తుఫాను వలన నష్టపోయిన బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి. సిపిఎం.


మైలవరం:-

అక్టోబర్ 11 ఎన్టీఆర్ జిల్లా మైలవరం. సిపిఎం పార్టీ మైలవరం నీట మునిగిన పంటల నమోదులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అసలైన లబ్ధిదారులకు ఎన్యుమరేషన్ సక్రమంగా జరగలేదు, దీనితో లబ్ధిదారులకు నష్ట పరిహారం అందలేదు. గత నెలలో వచ్చిన తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి వరద బాధితులకు నష్టపరిహారం వెంటనే అందించాలని సిపిఎం పార్టీ మైలవరం మండల కమిటీ డిమాండ్. శుక్రవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ ఇటీవల సిపిఎం పార్టీ మండల మహాసభ మైలవరంలో జరిగిందని ఈ మహాసభలో స్థానిక సమస్యలపై, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. చెరువులకు గండ్లు పడి నివాస గృహాల్లోకి వరద నీరు చేరిందని అలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా ఉండాలంటే చెరువు కట్టలను బలోపేతం చేయాలని, చెరువుల నుండి జరుగుతున్న అక్రమ మట్టి తోలకాలను ఆపాలని,

 చండ్రగూడెం గ్రామంలో మల్లె మార్కెట్ ఏర్పాటు చేయాలని, అసైన్ భూములను సాగు చేస్తున్న వారికి సాగు పట్టాలు ఇవ్వాలని, జగనన్న కాలనీలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, యువత జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్న మాదకద్రవ్యాలు, గంజాయి నివారణకు చర్యలు చేపట్టాలని, నీటి నిల్వలు పెంచుకునేందుకు మరుసు మల్లి పెద్ద చెరువు, పంగిడి చెరువు, గణపవరం చెరువులను రిజర్వాయర్లుగా ఏర్పాటు చేయాలని, ఫారెస్ట్ భూములను సాగు చేస్తున్న సాగుదారులకు ఎఫ్ ఆర్ చట్టం కింద పట్టాలు ఇవ్వాలని బు డమేరు ముంపు నివారణకు మూడు కమిటీలు వేశారని ఆ కమిటీల సూచనలను వెంటనే అమలు చేయాలని ఈ మహాసభ తీర్మానం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు రావూరి రమేష్ బాబు, ఎస్ ఇసాక్, రావుల సుబ్బారావు లు పాల్గొన్నారు.