Subscribe Us

header ads

అయ్యా నన్ను రక్షించండి


మైలవరం /రెడ్డిగూడెం :ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన మంజుల భవాని మీడియాతో మాట్లాడుతూ అయ్యా 07-10-2024 అనగా సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో మా ఇంటి సరిహద్దు న డేరంగుల కిరణ్, డేరంగుల రాజకుమార్ మరియు వాళ్ళ బావ ముగ్గురు కలిసి కూర్చొని ఉన్నారు. వారి వద్దకు నేను వెళ్లి స్నానాలు చేసే సమయం మాకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళండి అని వాళ్ళకి చెప్పాను వెళ్లినట్టే వెళ్లి తిరిగి మళ్ళీ నేను స్నానం చేసే సమయానికి వచ్చి సరిహద్దుపై కట్టుకున్న గ్రీన్ క్లాత్ పైకి లేపి తొంగి తొంగి చూస్తూ ఉండటం గమనించి భయంతో ఇంట్లోకి పరిగెత్తాను.
 అనంతరం వారి వద్దకు వెళ్లి మీరు ఎలా చేయడం తప్పు ఎందుకు అలా స్నానం చేస్తుంటే చూస్తున్నారు అని వాళ్ళని ప్రశ్నించగా మద్యం సేవించిన మత్తులో నాపై చేయి వేసి నన్ను కొట్టి నిన్ను అనుభవించేందుకే వచ్చామంటూ నాపై దాడి చేశారు. అప్పుడు భయంతో నేను కేకలు వేయగా మా ఇంటి పక్కన వారు వచ్చారు. తాగిన మత్తులో వాళ్లని కూడా కొట్టారు. దీంతో రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా ఎస్సై మోహన్ రావు కేసు నమోదు చేశారు. 
అయినప్పటికీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు మమ్ములను బెదిరిస్తూ మిమ్మల్ని చంపుతామంటూ బాయోందొలనకు గురి చేస్తున్నారు. కావున ఉన్నతాధికారులు వారినీ కఠినంగా శిక్షించి మమ్ములను రక్షించాలని కోరారు.
దీనిపై రెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ బి మోహన్ రావు వివరణ ఇస్తూ వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంజుల భవాని కుటుంబానికి ఎలాంటి ప్రమాదం వాళ్ల నుంచి జరగదని వారికి ధైర్యం ఇచ్చారు.