Subscribe Us

header ads

శిలువ ప్రతిష్ట వార్షికోత్సవం లో మదర్ సర్వీస్ సొసైటీ అన్నదానం.

మైలవరం /రెడ్డిగూడెం :ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండల పరిధిలోని జగ్గవరపుగుట్ట, రూపాంతరపు కొండపై రెడ్డిగూడెం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సి.ఎస్.ఐ) ఆధ్వర్యంలో 18వ శిలువ ప్రతిష్ట వార్షికోత్సవం ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి. 
ఈ కార్యక్రమంలో మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ప్రముఖ జర్నలిస్టు డా.మల్లాది ప్రసాదరావు మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ మంజీర గళం రిపోర్టర్ చింతిరాల అశోక్, మల్లాది వంశీ టైమ్స్ పత్రిక రిపోర్టర్ ఆధ్వర్యంలో పజ్జురి సతీష్ సహకారంతో క్రైస్తవ యాత్రికులకు అన్నదానం (వెజ్ బిర్యానీ) చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు డా.మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికత, పవిత్ర కార్యక్రమంలో భక్తులకు అన్నదానం చేయటం పూర్వజన్మ సుకృతం ఇంకా భావిస్తున్నాను అని ఆయన అన్నారు.
 రెవ జి.విశ్వనాథ్ ఆధ్వర్యంలో క్రైస్తవ భక్తులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా యాత్రికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మదర్ సర్వీస్ సొసైటీ కమిటీ పాస్టర్ రెవ. జి విశ్వనాథ్ ను ఘనంగా సన్మానించారు. పాస్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని ఆయన ప్రశంసించారు.