Subscribe Us

header ads

శ్రీ రతన్ టాటాకు క్యాబినెట్ నివాళి! రతన్ టాటా మృతి దేశానికే తీరని లోటన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


అమరావతి :దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతికి ఎపి క్యాబినెట్ సంతాపం తెలిపింది. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. 
సంపదనుసృష్టించడమే కాకుండా...ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషన్ రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రతన్ టాటా మృతికి సంతాపంగా క్యాబినెట్ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. 
రతన్ టాటా చిత్ర పటానికి పూలు వేసి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముంబై బయలుదేరి వెళ్లారు.