Subscribe Us

header ads

కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి (పెద్దబాబు)


 రెడ్డిగూడెం:

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం హరిజనవాడలో చింతరాల మరియమ్మ నివసిస్తున్న ఇల్లు వరదలకు కుప్పకూలిపోయింది. తమ పెద్ద కుమారుడు మంచాన పడటంతో తీరని దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు విజయబాబు యూత్ ఆధ్వర్యంలో రెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి (పెద్దబాబు) విషయం తెలిసిన వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి 10,000./ రూపాయలు ఆర్థిక సహాయం చేసి మీకు అన్నివేళలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ తో మాట్లాడి మీకు ఇల్లు కట్టించే దిశగా ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గుంటక ప్రణయ్, ఉయ్యూరు సుకుమార్ రెడ్డి, మాతంగి రామారావు, చాట్ల అచ్చాలు, అయ్యంకి కోటయ్య, చింతరాల రమేష్, పల్లేపాము రమేష్, చంటి, అనంత్ కుమార్, విజయ్, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.