మైలవరం /రెడ్డిగూడెం :ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం ఎస్సీ కాలనీలో చింతరాల మరియమ్మ కుటుంబం చాలా దారుణంగా ఉంది. మరియమ్మ కూలి పని చేస్తూ జీవనాన్ని సాగిస్తూ తమ ఇద్దరు కుమారులను చదివిస్తూ పెంచి పెద్ద చేసింది. ఇంతలో కాలం కన్నెర్ర చేసింది. ఆ కుటుంబాన్ని కన్నీరు మున్నీరు చేసింది. రెండు సంవత్సరాల క్రితం పెద్ద కుమారుడు చింతరాల శివ చెట్టుపై నుంచి కింద పడటంతో తన నడుము నుంచి కాళ్ల వరకు చలనం కోల్పోయాడు. దీంతో అప్పటినుంచి మంచానికే అంకితమైన శివ కుటుంబానికి ఇప్పుడు మరో బాధ తోడైంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన వర్షాలకు నీటి వరద తమ ఇంట్లోకి పోటెత్తడంతో వారి ఇల్లు కుప్పకూలిపోయింది.
మంచం మీద పడుకొని ఉన్న శివను తన తల్లి ఎత్తుకొని సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళ్ళింది . ఇప్పుడు వారు నివసించడానికి ఇల్లు లేక పక్కనే ఉన్న గేదెల పాకలో ఉంటున్నారు. మరో దారుణమైన విషయం ఏమిటంటే శివకు కనీసం ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా వచ్చిన దాఖలాలు లేకపోవడం బాధాకరం వరదలు వల్ల నివాసం ఉంటున్న ఇల్లు కుప్పకూలడంతో ఆ తల్లి బాధతో కన్నీరు మున్నీరు అవుతుంది.
ప్రభుత్వం వారు ఎలాంటి సహాయ చర్యలు చేయలేదని మా వైపు చూసిన నాయకులే లేరని దయవుంచి మా బాధని మా ఆవేదనని ఆలకించి ప్రభుత్వం మాకు సహాయం చేయాలని చింతరాల. మరియమ్మ. వారి కుమారుడు శివ ఆవేదన వ్యక్తం చేశారు.
కావున ఇంతటి కష్టంలో ఉన్న కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.