వీరమాచినేని డైట్ ను ప్రభుత్వం గుర్తించాలి
మధుమేహ వ్యాధిని సామాజిక సమస్యగా గుర్తించాలి
డయాబెటిక్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి
అమరావతి :మధుమేహం నివారణ పేరుతో ప్రజలు విరివిగా వినియోగిస్తున్న మెటమార్ఫిన్ మందుల శాస్త్రీయతపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టతనివ్వాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు కోరారు.
అమరావతిలో సురేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వయసుతో పని లేకుండా లక్షలాదిమంది మధుమేహంతో బాధపడుతూ విచ్చలవిడిగా మందులు వాడుతున్నారని తెలిపారు. ఎన్ని రకాల ఇన్సులిన్ మందులు వాడుతున్నప్పటికీ చాలామందికి మధుమేహం నియంత్రణలో ఉండటం లేదన్నారు. మధుమేహం సమాజంలో ఒక ప్రధాన సామాజిక సమస్యగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సులిన్ మందులతో మధుమేహం నియంత్రణలోకి రాకపోగా దీర్ఘకాలిక వినియోగంతో ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ ల వల్ల ప్రజలు అనేక రకాల ఆరోగ్య దుష్ఫలితాలకు గురవుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన వీరమాచినేని రామకృష్ణ డైట్ పేరుతో ఏడు,ఎనిమిది సంవత్సరాలుగా అనేకమంది డయాబెటిక్ బాధితులు ఎలాంటి మందులు వినియోగం లేకుండా డయాబెటిస్ ను పూర్తిగా నియంత్రణలో ఉంటునట్లు లక్షలాది మంది రక్తపరీక్షల రిపోర్టులతో ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు అని గుర్తు చేశారు .డయాబెటిక్ తో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు వి ఆర్ కె డైట్ ద్వారా పరిష్కారం లభిస్తుందని ప్రజలు నమ్ముతున్నట్లు రుజువు అవుతుందని తెలిపారు.
ప్రభుత్వం డయాబెటిక్ ను ఒక ప్రధాన సామాజిక సమస్యగా భావించి వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసి పరిష్కార మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డయాబెటిక్ ఫ్రీ రాష్ట్రంగా ఉండేలా ప్రభుత్వం డయాబెటిక్ నివారణకు ప్రయోగాత్మకంగా ఆధారాలతో రుజువు చేస్తున్న వి ఆర్ కె డైట్ విధానాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రజలలోకి తీసుకువెళ్లేలా చూడాలని కోరారు.
హోమియో, ఆయుర్వేదం వైద్య విధానాల తరహాలో విఆర్ కే డైట్ ను ఆధారాలతో సమీక్షించి ఆ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేలా ప్రజలకు అధికారికంగా సూచనలు చేయాలని సురేష్ బాబు కోరారు.డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల పై పలు సూచనలతో ప్రభుత్వానికి మరియు ఐసిఎంఆర్ఐ కు అసోసియేషన్ పక్షాన వినతిపత్రం సమర్పించనున్నట్లు సురేష్ బాబు తెలిపారు.