Subscribe Us

header ads

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

 జంగారెడ్డిగూడెం:-

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా వైద్యశాల లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ వైద్యశాల కార్మికులు ఏఐటియుసి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి మూడో రోజుకి చేరుకుంది. తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని కి సిపిఐ ఏఐటియుసి నాయకులు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు .ఈ సందర్భంగా సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణ రాజు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో పారిశుద్ధ్య కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్న పాలకులు కనికరించడం లేదన్నారు.

 పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 26000 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి, ఇప్పుడు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు మాట్లాడుతూ గత ఐదు నెలల నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడంలేదని, కాంట్రాక్టర్ ను అడిగితే ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ కొరకు కార్మికుల జీతంలో డబ్బులు కట్ చేసుకుంటూ వాటిని పిఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదని సదర్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల మండల సిపిఐ కార్యదర్శి గొలిమే బాలయేసు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం కార్యదర్శి బొక్కా శ్రీను, హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికుల సూపర్ వైజర్స్ వేముల రాజు, బూరుగు సంజీవ్, ఏరియా హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం (ఏఐటియుసి) నాయకులు తోట దయామని,అల్లాది జ్యోష్న,గంగుల మేరీ, ప్రభావతి, శ్రీను, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.