ఏలూరు:-
ఏలూరుజిల్లా రాష్ట్ర విభజన అనంతర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏపీకి ప్రత్యేకంగా సిఎస్ఆర్ నిధులు విడుదల చేసి ఆదుకోవాలని పెట్రోలియం కార్యదర్శి పంకజ్ జైన్ కు ఏలూరు ఎంపీ, ఇంధనం మరియు సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీలోని ఆయన కార్యాలయంలో సోమవారం పెట్రోలియం కార్యదర్శిని కలిసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వినతిపత్రం అందజేసి, పరిస్థితిని వివరించారు. అలాగే ఏపీలో ఇంధనం మరియు సహజవాయువు శాఖ పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా నిధులు విడుదల చేయడంలో ప్రాధాన్యత కల్పించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విన్నవించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించిన సమస్యలను సావధానంగా విన్న పెట్రోలియం కార్యదర్శి పంకజ్ జైన్ సానుకూలంగా స్పందించారు. నిధులు విడుదల చేయడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పంకజ్ జైన్ హామీ ఇచ్చినట్లు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు.