Subscribe Us

header ads

రైతాంగ సమస్యలు ప్రజా సమస్యలపై వినతి పత్రాలు జిల్లా కలెక్టర్ కి అందజేత.

ఏలూరు:-

ఏలూరుజిల్లా సోమవారం నాడు ఏలూరు జిల్లా కలెక్టర్కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఐ నాయకులు రైతాంగ సమస్యలపై ప్రజా సమస్యలపై వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం లో గుల్లపూడి, లో పూడి, చెక్కపల్లి లింగపాలెం మండలం లో కలరాయన గూడెం గ్రామాలకు చెందిన రైతులకు మొక్కజొన్న విత్తనాల 

కంపెనీల వారు నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులకు దిగుబడి రాక తీవ్ర నష్టాలకు గురయ్యారని ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య బికేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

మొక్కజొన్న విత్తనాలు దిగుబడి రాకపోతే ఎకరాకు ఒక రకానికి 75000 మరో రకానికి 80 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని హైదరాబాద్ కు చెందిన సాయి భవ్య సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, త్రిమూర్తి సైన్స్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక చెందిన హై వేజ్ సీడ్స్ కంపెనీ ల ఆర్గనైజర్స్

 సీడ్స్ ని సరఫరా చేశారని వారు కలెక్టర్ తెలిపారు. రైతులను మోసం చేసిన మొక్కజొన్న సీడ్స్ కంపెనీల మీద ఆర్గనైజర్స్ పైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్కు రైతులు మోసం చేసిన మొక్కజొన్న సీడ్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. 

అలాగే జంగారెడ్డిగూడెం మండలంలోని రైతు భూమికి సంబంధించి హక్కు పత్రాలు ఇప్పించాలని మరియు చింతలపూడి మండలం మల్లాయగూడెం గ్రామ ప్రజలకు గత 10 ఏళ్లుగా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని ఆ గ్రామానికి త్రాగునీర్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు

మొక్కజొన్న సీడ్స్ కంపెనీల వారి పైన మరియు ఆర్గనైజస్ పైన చర్యలు తీసుకోవాలని నాయకులు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ ను మరియు జిల్లా ఎస్పీని కలిసిన వారిలో రైతు సంఘం నాయకులు వరప్రసాదరావు ఆనంద్ తదితరులు ఉన్నారు.