Subscribe Us

header ads

విద్య మరియు క్రీడలను సమన్వయం చేసుకోవాలి

 ఆగిరిపల్లి:-

విద్యార్థులు విద్యను మరియు క్రీడలను సమన్వయం చేసుకొని విద్యాభ్యాసాన్ని పరిపూర్ణం గావించాలని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ మరియు ద్రోణచార్య అవార్డు గ్రహీత నాగపురి. రమేష్ అన్నారు. మండలం లోని తోటపల్లి లో గల హీల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన చెకుముఖి సైన్స్ సంబరాలు -2024 లో ప్రధమ స్థానం సాధించిన సందర్భముగా జరిగిన అభినందన కార్యక్రమములో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

మానసిక ఉల్లాసం,శరీర ధ్రుఢత్వం, పోటీతత్వం,పట్టుదల, నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్ధ్యం పెరుగుతాయాన్నారు.ఉద్యోగ మరియు ఉపాధి రంగాలలోనూ,దేశానికి పేరు ప్రతిష్టలు సాధించడము లోను క్రీడల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హీల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోనేరు సత్య ప్రసాద్, ప్రిన్సిపాల్ బి.సాయిబాబు, అథ్లెటిక్స్ కోచ్ శ్రీనివాస రెడ్డి, హీల్ అంధ పాఠశాల ఇన్స్ట్రక్టర్ ఎస్. రుష్మంత్ పాల్గొన్నారు.