జంగారెడ్డిగూడెం:-
ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువైయున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కొయ్యలగూడెం మండలం సీతంపేటలోని శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం నిర్వహణలో,ఆలయ కమిటీ,భక్తులు,దాతల తోడ్పాటుతో పరమ పవిత్ర కార్తికమాసంలో నవంబర్ 18,సోమవారం సాయంత్రం 4:00 గంటల నుండి శతాధిక కల్యాణకర్తలచే శ్రీ శ్రీనివాస శివ కార్తికేయ దివ్య కల్యాణ మహోత్సవం జరుగుతుందని నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు, శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు,శుక్ల యజుర్వేద పండితులు యర్రమిల్లి సాయి నరసింహ మనోజ్ శర్మ ప్రకటించారు.
శుక్రవారం ఉదయం నూకాలమ్మ అమ్మవారి దివ్యసన్నిధిలో కార్యక్రమ వివరాలతో కూడిన ఆహ్వానపత్రాలు ఆవిష్కరించే కార్యక్రమం ఆహ్వానపత్రాలు ఆవిష్కరించి ప్రసంగించారు. డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) మాట్లాడుతూ ఒకే వేదిక,ఒకే ముహూర్తంలో జరపతలపెట్టిన త్రిగుణాత్మక కల్యాణంకు వేదికగా నూకాలమ్మ అమ్మవారి దేవాలయం నిలుస్తోందని కళ్యాణాలు అనంతరం నూకాలమ్మ అమ్మవారికి ఏకాదశ మంగళ నీరాజనాలు మరియు లక్ష దీపోత్సవం జరుగుతుందని,యర్రమిల్లి మనోజ్ శర్మ సంకల్పానికి లోకకళ్యాణార్ధం తాను వ్యక్తిగతంగా,ఆలయకమిటీ ద్వారా సహకారం అందిస్తున్నామని,ఆధ్యాత్మిక వైభవం లో తమ వంతు భాధ్యతను నిర్వహిస్తామని తెలిపారు.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠ ప్రతినిధి ఈమని శశి కుమార్ శర్మ మాట్లాడుతూ కార్తీకమాసం అంటేనే భక్తులందరిలో భక్తి భావాలు పొంగి పొరలే సమయమని అదృష్టం కొద్దీ జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి కార్తీక మాసంలో వైభవంగా కార్తీక శోభ ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని ఈ సంవత్సరం శ్రీ రాజేశ్వరి త్రిశక్తి పీఠం ద్వారా కొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుందని అన్నారు. ఒకే వేదిక పైన మూడు కల్యాణాలు ఏకకాలంలో నిర్వహించడం బహు అరుదుగా జరిగే కార్యక్రమం అన్నారు.
సాధారణంగా కార్తీకమాసాన్ని శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసంగా చెప్తారని ఆ శివకేశవుల అభేద్యాన్ని సూచిస్తూ జరిగే కళ్యాణోత్సవంలో భక్తులందరూ పాల్గొని తరించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మాజీ చైర్పర్సన్బంగారు శివలక్ష్మి పాలపర్తి శ్రీనివాస్ చిన్ని రామసత్యనారాయణ చిన్ని హరీష్కందులపాటి సురేష్ కనుపర్తి ధనకుమార్ భవిరిశెట్టి మురళీకృష్ణ పీవీ కృష్ణారావు కలగర వీర్రాజు నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ భక్త మహాజనులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కనుపర్తి ధనకుమార్ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.