Subscribe Us

header ads

జాతీయస్థాయి వాలీబాల్ పోటీకి ఎంపికైన ఈదర విద్యార్థి

 ఆగిరిపల్లి:-

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంస్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడోత్సవాలలో భాగంగా అండర్ 14 బాలుర విభాగంలో ఈదర హై స్కూల్ కి చెందిన గోరుముచ్చు అభిలాష్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీకి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ శారద తెలియజేశారు.పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో విజయవాడ పడమట హై స్కూల్లో జరిగిన వాలీబాల్ అండర్ 14 బాలుర విభాగంలో ఈదర హై స్కూల్ కి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి గురుముచ్చు అభిలాష్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీకి ఎంపిక అవ్వడం పట్ల పాఠశాలకు విద్యార్థి తల్లిదండ్రులకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

విద్యార్థులకు శిక్షణ ఇచ్చినటు వంటి వ్యాయామ ఉపాధ్యాయుని ప్రమీలా రాణి అభినందించారు.వ్యాయామ ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల పైన మంచి ప్రతిభను కనజీవితంలో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని క్రీడల వల్ల కూడా గౌరవ మర్యాదలతో పాటు మంచి ఉద్యోగాలను కూడా సంపాదించుకోవచ్చు అన్నారు.విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పి.టి ప్రమీలా రాణి, ప్రధానో పాధ్యాయిని శ్రీమతియస్.శారద,పేరెంట్స్ కమిటీ చైర్మన్ కే అంజయ్య,గ్రామ సర్పంచ్ డి.అనిత ఏసు పాదం పాల్గొన్నారు.